Fun facts – 9

శ్రీశారదా దయా చంద్రికా :—
19—08—2817; శనివారము.

వాస్తవాలు-వినోదాలు/Fun-Facts—9.

1. మనకి మొనా లీసా(Mona Lisa) చిత్రం రచించిన లియొనార్డో ది వించి సుపరిచితుడే! ఆయన ఇటలీదేశంలోని ఫ్లారెన్స్ (Florence) నగరవాసి.  1452 నుండి 1519 వరకు వారు జీవిచేరు. వారు బహుముఖప్రజ్ఞాశాలి. మానవదేహశాస్త్రం(Anatomy), యంత్రశాస్త్రం(Engineering), గణితశాస్త్రం(Mathematics), ప్రకృతిశాస్త్రం(Natural Science), తత్త్వశాస్త్రం(Philosophy), చిత్రకళ(Painting), శిల్పశాస్త్రం(Sculpture), భవననిర్మాణశాస్త్రం(Architecture) మొదలైన అనేకవిషయాలలో వారు సంపూర్ణ నైపుణ్యం సాధించేరు. కొన్నివందల క్రొత్తవిషయాలని, వస్తువులని వారుకనుగొన్నారు.
అలాంటివాటిలో చెప్పుకోదగ్గ అంశాలలో, ఆ కాలంలో, వారు నిద్రలోవున్నవారిని అవసరమైనప్పుడు మేల్కొల్పడానికి ఒక చిత్రమైన అలారం గడియారాన్ని కనుగొన్నారు. నిద్రపోయేవారిని వారి అరికాలులో
మృదువుగా గోకి మేల్కొల్పడం ఆ గడియారం ప్రత్యేకత!

2. 1930 మొదటిభాగంలో, అమెరికాలో, John Dillinger అనే పేరుకలిగిన నెంబర్ వన్ నేరస్థుడు ఉండేవాడు. అతడుచేసిననేరాలకి పోలీసువారు అతడిని పట్టుకుని తగినశిక్షవేయించేవారు. ఇలాగ తరచు నేరంచేయడం, ముఖ్యంగా వేలుముద్రల క్లూ ద్వారా పట్టుబడడం భరించలేక అతడు ఒక దుస్సాహసం చేసేడు. ఒక ఏసిడ్ లో రెండుచేతులు చర్మం కాలేటట్లుపెట్టి తరవాత మెల్లిగా మానిపోయేవరకు తగనిబాధని అనుభవించేడట. పూర్తిగా చేతులు మానిపోయిన తరవాత తన సహనేరస్థుడిచేత తన వేలిముద్రలని పరీక్ష చేయించుకున్నాడట. తీరాచూస్తే తన అసలు వేలిముద్రలు ఏమీ మారక
పోవడంగమనించి హతాశుడయ్యేడు.

3. ప్రసిద్ధ పాశ్చాత్య శాస్త్రీయసంగీతకారుడు మొత్జార్ట్ (Mozart) 8సంవత్సరాల వయస్సులోనే తన మొట్టమొదటి సంగీతరచన ఐన సింఫొనీ(Symphony) ని స్వరబద్ధం చేసి ప్రకటించేడట. ఆ తరవాత 27 సంవత్సరాలుమాత్రం ఆయన జీవించేరు. అంటే 35 సంవత్సరాలవయస్సులోనే వారు స్వర్గస్థులయ్యేరు.ఆ 27 ఏళ్ళ వ్యవధిలోనే వారు వివిధ ఆపెరాలు(operas), సింఫొనీలు(symphonies), సొనాటాలు
(sonatas), కంచెర్టోలు(concertos) మొదలైన సుమారు వెయ్యి వాద్యసంగీత కృతులని రచించేరట!ఐతే వారు జీవించివుండగా 70 రచనలు మాత్రమే ప్రకటించబడ్డాయి.

You may also like...

1 Response

  1. Chaganty RamaRao says:

    Very useful information.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *