సమీచీనం వచో బ్రహ్మన్
“సమీచీనం వచో బ్రహ్మన్
సర్వజ్ఞస్య తవానఘ! |
తమో విశీర్యతే మహ్యం
హరేః కథయతః కథామ్ “||
“పావనస్వరూపుడవైన ఓ మహాను భావా! నీ మాట సత్యమైనది. సర్వజ్ఞుడవైన నీవు చెప్పెడి శ్రీహరియొక్క కథ నా అవిద్యని పటాపంౘలు చేస్తోంది“.
ఈ శ్లోకంలో మనకి కావలసిన “సమీచీనం వచః” అనే ప్రయోగం ఉంది. మాట బాగుంది, ౘక్కగా ఉంది, యోగ్యంగా/ఉచితరీతిలో/తగినవిధంగా/సందర్భోచితంగా ఉంది అని ఇక్కడ చెప్పాలి.
విజయధ్వజీయంలో కూడా “శుకవచనం స్తౌతి సమీచీనమ్ ఇతి“అని వుంది. “శ్రీశుకుల మాటని (రాజు) ఔచిత్యస్ఫూర్తితో భాసిల్లుతోంది అని స్తుతించేడు” అని దీని భావం.
సుధీసుధాకారుడు “సమీచీనం యుక్తం” అని వివరించేడు. ఈ వివరం విద్వద్విదూషకుడైన మన శ్రీరామ్ కి సరిపోతుంది. మిగిలినది అతడు అల్లుకు పోగలడు.