ఘోరకరాగ్రతలంబున
13—08—2017; ఆదివారం. 05-50AM.
ఇతరములు—Miscellany.
ఈ శీర్షికలో ఈరోజు నా ప్రాణమిత్రుడు, శ్రీ ఎం.ఎ.వహాబ్ జీ సందేహంతీర్చే ప్రయత్నంచేస్తాను.
ఒక తెలుగు ప్రముఖదినపత్రికలో పోతనగారి భాగవతంలో వర్ణింపబడిన ఒక ఘట్టం అనుచితసంఘటనగా ఒక భాగవతప్రియపాఠకుడు అభిప్రాయపడిన వార్తని నా మిత్రుడు నాకు పంపి ఈ అంశంపైన నా వాస్తవికవిశ్లేషణని కోరేడు. ఈ అంశం ఈ రోజు మన చర్చకి విషయం. పోతనభాగవతంలో జరిగిన వృత్తాంతం పత్రికలో సరిగానే వివరింౘబడింది. కృష్ణుడు రజకుడిని రాజుగారి దుస్తులలో కొన్ని తాను, బలరాముడు, గోపబాలురు ధరించడానికి యిమ్మని యాచిస్తాడు. అతడు పరుషమైన పదజాలంతో కృష్ణాదులని దూషించి,తగిననకారణంచెప్పి దుస్తులు యివ్వడు. 7—8 సంవత్సరాల వయస్సున్న కృష్ణుడు తన “ఘోరకరాగ్రతలంబున” అంటే భయంకరమైన వ్రేళ్ళకొనలు కలిగిన తన అరచేయితో రజకశిరస్సు తెగకొట్టి చంపేడు.
మూల వ్యాససంస్కృతభాగవతంలో కూడా యీ సంఘటన ఇంచుమించు ఇలాగే వర్ణించబడింది. సంస్కృతంలోని “హరివంశమహాపురాణం” లో కూడా ఈ ఘటన రమారమి ఇలాగే వివరించబడింది.
మాత్రమే! ఈ పవిత్రగ్రంథంలో 10 అధ్యాయాలున్నాయి. ఈ అధ్యాయాలని “ఖండములు” అంటారు. దీనిలో ఐదవది “మథురాఖండము”. ఈ ఖండంలో ఐదవ అధ్యాయంలో రజకవధ వృత్తాంతం మిగిలిన గ్రంథాలలో వున్నట్లే వ్రాయబడినప్పటికీ, మనకి కీలకమైన బోధపరిచే అదనపు వివరణ ఈ విధంగా చెప్పబడింది.
“ఏవం ప్రవదతః తస్య
రజకస్య యదూత్తమః |
జహార మస్తకం సద్యః
కరాగ్రేణైవ లీలయా || 40 ||
తత్ జ్యోతిః శ్రీఘనశ్యామే
లీనం జాతం——- |” 41 (పూర్వార్థం)|
“ఇలాగ పరుషభాషణం చేస్తున్న రజకుని శిరస్సుని కృష్టుడు తన కరాగ్రంతో ‘లీల‘ గా ఖండించేడు. వెంటనే ఆ రజకునిలోనుండి ఒక తేజస్సు బయటికి వచ్చి శ్రీకృష్ణుడిలో లీనమయ్యింది”.
పై శ్రోకాలలో ‘లీల’ అనేమాట, రజకుడిలోనుంచి కాంతిపుంజం బయటికివచ్చి కృష్ణుడిలో కలవడం కీలకమైన అంశాలు. ఈ రజకుడు కేవలం రాక్షసాంశతో పుట్టేడు. కంసుడు పూర్వజన్మలో కాలనేమిఅనేరాక్షసుడు. అతడి అనుచరులలో చాలామంది రాక్షసులే. అటువంటి రాక్షసులలో ఈ రజకుడు ఒకడు. కృష్ణుడి అవతార ఉద్దేశ్యాలలో ఈ ఆసురీజన్ములని సంహరించడం, ఉగ్రసేనాది దివ్యాంశ సంభూతులని రక్షించడం ఒకముఖ్య కర్తవ్యం. ఇక్కడ రజకుడంటే మన ఈ కాలంలోని రజకుడిగా భావించకూడదు. కేవలం తెలుగు అనువాదాలకే పరిమితమై అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు.
కాలాంతరంలో మోక్షమిస్తాడు. అందువలన రజక ఉద్ధరణ జరిగింది తప్ప రజకవధ జరగలేదు. బాహ్యదృష్టికి ఘోరకర్మగా కనిపించే దైవలీల లోచూపుతో గ్రహిస్తేతప్ప సృష్టిగతితత్త్వరహస్యాలు అవగాహనకి రావు.
స్వస్తి||