Fun facts –8

శ్రీశారదా దయా చంద్రికా:—
12—08—2017;  శనివారము.వాస్తవాలు—వినోదాలు—8.

1. 1928 లో Walt Disney & Ub Iwerks మొదటిసారిగా మిక్కీ మౌస్ ని తయారుచేసినప్పుడు, ఆ పాత్రకి మోర్టిమర్ (Mortimer) అని పేరు పెట్టేరు. మొట్టమొదటి Micky Mouse కార్టూనుసినమా “ప్లేన్ క్రేజీ” కి బొమ్మలు Ub Iwerks రచించేడు. మొదటిరోజులలో మిక్కీ మౌసుకి వాల్ట్ డిస్నీయే తన కంఠంతో మాట్లాడేడు. ఆ రోజులలో మిగిలిన హాలీవుడ్ నటీనటులందరికన్న మిక్కీ మౌస్కే అధికసంఖ్యలో అభిమానుల ఉత్తరాలు వచ్చేవి.

2. ఒక మగ జిరాఫి సుమారు ఇరవై అడుగుల ఎత్తు వుంటుంది. అంటే మన రెండంతస్తుల మేడంత ఎత్తు అన్నమాట! దాని మెడ ఇంచుమించు ఏడడుగుల పొడవు వుంటుంది. అది పూర్తిగా ఎదిగేసరికి సుమారు రెండుటన్నుల బరువు వుంటుంది. అది ఒకగంటకి ముప్ఫై మైళ్ళవరకు వేగంతో పరుగుపెట్టగలదు. దాని నాలుక బయటకి ఇరవై అంగుళాలపొడవు చాపగలదు. ఐతే మనుష్యులతోసహా అన్ని జంతువులకిలాగే దాని పొడవైన మెడలోకూడా ఏడు యెముకల నిర్మాణమేవుంది.

3. “Gone with the Wind” (గాన్ విత్ ది విండ్ ) ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ప్రత్యేకస్థానంపొందింది. దాంట్లో హీరోగా నటించడానికి అంటే Rhett Butler పాత్రపోషించడానికి Gary Cooper ని సంప్రదించేరు. ఆయన  తన తిరస్కారానికి చెప్పిన కారణం యిది: “ఆ చలనచిత్రం సినీరంగచరిత్రలోనే ఘోరమైన “ఫ్లాప్ ” చిత్రంగా ఔతుంది”. ఆ తరవాత రెట్ బట్లర్ పాత్రని ధరించి క్లార్క్ గేబ్ల్ (Clark Gable) హాలీవుడ్లో అమోఘచరిత్రని సృష్టించడం లోకవిదితమైన విషయమే!

స్వస్తి||

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *