గాయత్రీ మన్త్ర భాష్యం

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :
(27-5-17)జగద్గురువులు శ్రీ ఆదిశఙ్కరాచార్య స్వామివారు తమ గాయత్రీ మన్త్ర భాష్యంలో ఇలా బోధించేరు. :

మూ.”—శుద్ధా గాయత్రీ ప్రత్యగ్బ్రహ్మైక్య బోధికా“||

తా. శుద్ధ గాయత్రీ మంత్రం ప్రత్యగాత్మకి, పరబ్రహ్మకి ఐక్యతని, అంటే అభేదాన్ని తెలియజేస్తోంది.

మూ.”తత్సవితుః ఇత్యాది పదైః నిర్దిశ్యతే“||

తా.(ఆ గాయత్రీ పరదేవత) తత్ , సవితుః, వరేణ్యం, భర్గః, దేవస్య అనే ఈ మాటలచేత వివరింపబడి, నిర్దేశింౘబడుతోంది.

మూ.”తత్ర ఓం తత్సదితి నిర్దేశో
బ్రహ్మణః త్రివిధః స్మృత ఇతి“||

తా.ఈ సందర్భంలో “ఓమ్ “, “తత్ “, “సత్ “, అనే ఈ మూడు (పవిత్ర వైదిక) పదాలు, పరబ్రహ్మని మన్త్రత్వ విభూతితో ప్రకటించజాలిన శక్తి గలిగినవి.

మూ.”తత్ శబ్దేన ప్రత్యగ్భూతం స్వతః

సిద్ధం పరం బ్రహ్మోచ్యతే“||

తా.తత్ అంటే ప్రత్యగాత్మగా భాసించేది స్వతస్సిద్ధమైన పరబ్రహ్మగానే వేదం బోధిస్తోంది.

మూ.”సవితుః ఇతి|| సృష్టి, స్థతి, లయ
లక్షణకస్య సర్వ ప్రపంచస్య 
ద్వైతవిభ్రమస్య అధిష్ఠానం లక్ష్యతే“||

తా.సవితుః=సవితా=సృష్టి, స్థితి, లయ అనే లక్షణాలు కలిగి ఉండడంవల్ల ద్వైత సంసార వికారంగా భ్రమింపజేసే సకల సృష్టికి ఆధారభూతుడైనవాడు

మూ.”వరేణ్యం ఇతి|| సర్వ వరణీయం
నిరతిశయానంద రూపమ్ “||

తా.సర్వసృష్టికి నిరపేక్ష ధ్యేయ స్వరూపమైన, పరిపూర్ణ ఆనందము తానే అయినది.

మూ.”భర్గ ఇతి|| అవిద్యాది దోష
భర్జనాత్మక జ్ఞానైక విషయత్వమ్ “||

తా.అజ్ఞానాది సర్వదోషాలని నిర్మూలింపజేసే శుద్ధజ్ఞానం ద్వారా మాత్రమే పొందదగినవాడు.

మూ.”దేవస్య ఇతి|| సర్వద్యోతనాత్మక
చిదేక రసమ్ —“||

తా. అన్నింటిని ప్రకాశింపచేయగలిగిన స్వస్వరూప అఖండైక జ్ఞానమే రసస్వరూపమైనవాడు.

మూ.”ధీమహి“||

తా.ధ్యానించెదము.

మూ.”ధియో యో నః ప్రచోదయాత్ “||

తా.ఎవరు మా బుద్ధులను ప్రేరణ చేయుచున్నారో(అట్టి పరబ్రహ్శను ధ్యానించెదము. ఆ పరబ్రహ్శయొక్క మూలత్త్వము పై వైదిక పరిభాషలో స్పష్టముగా నిరూపింపబడి నిర్దేశించబడినది. ఈ భాష్యిర్థమే మనకు పరమ ప్రామాణికము.

చివరి తాత్పర్యంలో కుండలీకరణములలో “మూలతత్వము” గాను, “భాష్యార్థము” గాను సవరించి ౘదువుకొన వలసిననిదిగా మనవి. స్ఖాలిత్యములకు క్షంతవ్యుడిని. మూడు వ్యాహృతుల వివరణ

ప్రత్యేకంగా పంపబడుతోంది. గమనింౘ ప్రార్థన.

మూ.”భూరితి నిత్యత్వముచ్యతే||
సర్వవ్యాపి, సర్వకాలికం, సర్వోత్కృష్టం, నిత్యముక్తం,ఆత్మస్వరూపం, సన్మాత్రం ఉచ్యతే||
భువ ఇతి సర్వం భాసయతి||
ప్రకాశయతి ఇతి వ్యుత్పత్యా చిద్రూపత్వం ఉచ్యతే||
స్వరితి సుష్ఠు సర్వైః వ్రియమాణ సుస్వరూపం ఉచ్యతే|| …..”

తా. “భూః” అంటే సర్వకాలాలలో, సర్వత్ర వ్యాపించి ఉండేది. “భువః” అంటే సర్వాన్ని ప్రకాశింపచేసేది. “స్వః” లేక “సువః” అంటే అందరూ పొందడానికి తహతహలాడేది. ఈ మూడింటికీ ఆచార్యులవారు

భూః=ఎల్లవేళల ఉండేది=సత్ , భువః=తెలియజేసేది=చిత్ , సువః=అందరూపొందగోరేది= ఆనందము అని వివరించేరు.

స్వస్తి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *