శతమానమ్
శుక్లయజుర్వేదాంతర్గతమైన వాజసనేయసంహిత(19–93)లో “ఇంద్రస్య రూపం శతమానం—” అని వర్ణన ఉంది.
ఈ “శతమానం” అనే పదబంధానికి మహీధరభాష్యం యీ విధంగా వివరణనిచ్చింది:
“శతానాం ఏకేషాం ప్రాణినాం ‘మానం’,
పూజా యస్మిన్ తత్ –జగత్ పూజ్యం ఇతి అర్థః“|
అంటే వందలకొద్దీ ఉన్నవారిలో (దేవతలలో) ప్రత్యేక గౌరవనీయుడు లేక పూజ్యుడు ఇంద్రుడు అన్నమాట. అంటే సజాతీయులలో ప్రత్యేక పూజ్యత లేక గౌరవనీయత కలిగి ఉండడాన్ని వైదికపరిభాషలో “శతమానం” అంటారన్నమాట!
శతేంద్రియః : ఇంద్రస్య ఆత్మనః లింగం అనుమాపకం అని ఇంద్రియ శబ్ద వ్యుత్పత్తి. ఇంద్రియశబ్దం జీవుడికి చిహ్నం లేక గుర్తు. అయితే ఈ ప్రధానార్థం ఉన్నా యిక్కడ ఇంద్రియానికి అవయవము (organ), శరీరభాగము(part of body), బహిరంతర జ్ఞాన, కర్మ, సూక్ష్మ ఇంద్రియాలు(organs of senses, action & four-fold subtle instruments of innerbeing) అనే అర్థాలు గ్రహించాలి. అంటే బాహ్యాభ్యంతర అనేక
ఇప్పుడు ఒక syntactical pattern లో పెట్టి మంత్రభావాన్ని పరికిద్డాం:
శతేంద్రియః శతాయుః పురుషః
శతమానం భవతి| (ఏతత్ తస్య)
ఆయుషి ఏవ ఇంద్రియే ప్రతి తిష్ఠతి,
ప్రతి తిష్ఠతి|
భావం:
అనేక బాహ్యాభ్యంతర అవయవాలుకలిగి, శతసంవత్సర జీవితం కలిగిన పురుషుడు అనేకజనులలో ఒక ప్రత్యేక వ్యక్తిగా మన్నన పొందుతున్నాడు. అటువంటి యజమాని ఆత్మస్థైర్యాన్నిపొంది ఇహపరాలు రెండూ సాధిస్తున్నాడు. (ప్రతి తిష్ఠతి అని రెండు మారులు అనడానికి ఇది కారణం).
స్వస్తి|
చాలా సంతోషం.నీ యీ బహు భాషా ప్రావీణ్యానికి జోహార్లు.నీ వంటి సన్మిత్రుడు లభించడం నా పూర్వ జన్మ సుకృతం.
-కె.వి.జోగన్న
చాలా బాగుంది..highly educative