Fun facts – 5

శ్రీశారదా దయా దీప్తిః :—
22–07–2017; శనివారం; 8–00AM.

వాస్తవాలు–వినోదాలు—5.

1. మనం తరచుగా ఆంగ్లంలోని “Gadget” అనేమాటని ఉపయోగిస్తూంటాం. ఈ మాటయొక్క వ్యుత్పత్తి(Etymological derivation) ఎంత అస్పష్టంగా వుంటుందో దీని అర్థంకూడా ఇదమిత్థంగా తేల్చి చెప్పడానికి అంత సందిగ్ధంగానూ వుంటుంది. ఓడలలోని ఉద్యోగులు వారు ఉపయోగించే కొన్ని అప్రధానమైన చిన్న పనిముట్లని ఏ పేరూ లేనివాటిని “గేజట్ “(Gadget) అంటూవుండేవారట. మరొక కథనంప్రకారం 1886 లో ఫ్రెంచిదేశానికిచెందిన Gaget అనే పేరుగలాయన స్టేట్యూ ఆఫ్ లిబర్టీని అనుకరించి చిన్న చిన్న బొమ్మలు తయారుచేసి అమ్మేవాడట. ఈ మినియేచర్ బొమ్మలని గేజట్స్ అని పిలిచేవారట. క్రమంగా చిన్న పనిముట్లనన్నీ Gadgets అని అంటున్నాము.

2. హాలివుడ్ నటీనటులు, మేరిలిన్ మన్రో – టోనీ కర్టిస్  “సమ్ లైకిట్ హాట్ ” అనేచిత్రంలో ప్రధానపాత్రలలో నటించేరు. సినిమా విషయం ఏమైనా హీరోకి హీరోయిన్ తో సరిపడలేదు. దాంతో టోనీకర్టిస్ చిరాకుపడి, “నేను మేరిలిన్ మన్రోని ముద్దు పెట్టుకోవడం కన్న ఎడాల్ఫ్ హిట్లర్ ని ముద్దు పెట్టుకుంటాను” అన్నాడట!

3. విశ్వవిఖ్యాత పాశ్చాత్య శాస్త్రీయ సంగీతకళాకారుడు బీథోవెన్ తన అత్యంతప్రధానరచనలుచేసే సమయానికి పూర్తిగా చెవిటివాడైపోయాడట. ఆయన చివరిజీవితకాలానికి సంబంధించిన ఒక జీవితచరిత్ర

గ్రంథంయొక్క 28 పుటల అనుబంధం అంతా ఆయనకి అప్పటివరకు వున్నవ్యాధుల వివరాలతో నిండిపోయి వున్నదట. చిట్టచివరికి ఆయన శరీరమంతా నీరుపట్టడంవల్ల మరణించారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *