Fun facts – 1
[6/24, 11:07 PM]వాస్తవాలు-వినోదాలు: 1.
ఈ శీర్షికలో మనకి వినోదంకలిగించే, విడ్డూరమనిపించే కొన్ని ప్రపంచవ్యాప్త వివిధరంగాలకి చెందిన విషయాలని గురించి తెలుసుకుందాం!
ఈ వారం వాస్తవాలు- వినోదాలు:
1. యుక్తవయస్సువచ్చిన సగటువ్యక్తి శరీరం 3,000 చతురపు అంగుళాల విస్తీర్ణం ఉన్న చర్మంతో కప్పబడివుంటుంది. మొత్తం అంతటికి మడమక్రిందిచర్మం గట్టిగాను, దళసరిగాను వుంటుంది. సుమారు 70 సంవత్సరాలు జీవించేవ్యక్తి తన జీవితంలో కనీసం 1,50,000 మైళ్ళ దూరం నడవడం జరుగుతుందని ఒక అంౘనా.
2. ఇంగ్లండ్ కి చెందిన Samuel Rogers అనే కవిని ఆయన కవిత్వ విషయంలోకన్న మరెవరికి లేని ఒక అరుదైనవిషయానికి చరిత్ర జ్ఞాపకం వుంచుకుంటుంది. విక్టోరియామహారాణి ఆస్థానంలో1843 లో ఆస్థానకవిగావున్నWilliam Wordsworth కి, ఆ తరవాత 1850 లో ఆస్థానకవి ఐన Alfred, Lord Tennyson కి వీరిద్దరికికూడా మొదటిసారి రాజాస్థానానికి వెళ్ళడానికి తన Morning Suit ని అరువుగా యిచ్చాడు. ఇదీ ఆయనగారి గొప్పతనం!
3. తాజ్ మహల్ 17 వ శతాబ్ది కట్టడం. తన ప్రేయసి/భార్య ముంతాజ్ స్మృతి చిహ్నంగా దీనిని షాజహాన్ కట్టించేడు. ఐతిహ్యం ప్రకారం ఈ అపూర్వనిర్మాణం చక్రవర్తికి కలలో కనిపించిందట! ఈ కట్టడం నిర్మించ సిద్ధపడిన మహాశిల్పికి ఒక ప్రత్యేక దివ్యౌషధం యిచ్చి షాజహానుకి కలలో కనిపించిన ఊహాహర్మ్యం అతనికికూడా subconscious state లో దర్శనం అయ్యేటట్టు చేసి నిర్మాణం ఆరంభించేరుట!