సాహిత్యము సౌహిత్యము – 4 : వృక్షాగ్ర వాసీ న చ పక్షిరాజః

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :—
(4-6-17; ఆదివారం):

ఈ సంచికలో పిల్లలకి చెప్పడానికి అనుకూలమైన, విద్యని-వినోదాన్నీ కలిగించే పొడుపుకథలు సంస్కృత శ్లోకాలలో ఉన్నవి, నా చిన్నతనంలో విన్నవి ముచ్చటించుకుందాం!

వృక్షాగ్ర వాసీ న చ పక్షిరాజః
త్రినేత్రధారీ న చ శంకరోsయమ్  
త్వగస్త్రధారీ న చ సిద్ధయోగీ
జలఞ్చ బిభ్రన్న ఘటో న మేఘః” ||

చెట్టు పైన ఉంటాడు కాని పక్షిరాజు కాదు.
మూడు కళ్ళుంటాయి కాని శివుడు కాడు.
నారబట్టలు కడతాడు కాని సిద్ధుడైన యోగి కాడు.
నీటితో తాను నిండి ఉంటాడు కాని కుండాకాదు, మబ్బూ కాదు.
అతడు/అది ఎవరు? అంటే కొబ్బరికాయ అని సమాధానం.

పైశ్లోకంలో ఉన్న వర్ణన అంతా కొబ్బరికాయకి పూర్తిగా సరిపోతుంది.

స్వస్తి||

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *